telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్‌

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 2018 జులై లో పెంచిన 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో కరువు భత్యం 27.248 నుంచి 30.392 కు పెరిగింది. 2021 జనవరి జీతాలతో కలిపి నగదుగా చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2018 జులై 1 నుంచి 2020 డిసెంబర్‌ 31 వరకు 30 నెలల బకాయిలు జీపీఎఫ్ ‌, జడ్పీపీఎఫ్‌ వారికి 3 సమ భాగాల్లో పీఎఫ్‌ ఖాతాల్లో జమ చేయనుంది. సీపీఎస్‌ వారికి 30 నెలల ఆరియర్స్‌ 90 శాతం నగదుతో పాటు 10 శాతం ప్రాన్‌ అకౌంట్‌కు జనవరి జీతాల చెల్లింపు తర్వాత 3 సమ భాగాల్లో జమ చేస్తామంది. 2019 జనవరి డీఏ 2021 జులై నుంచి… 2019 జులై డీఏ.. జూలై డీఏ 2022 జనవరి నుంచి చెల్లించడానికి జగన్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లోని ప్రభుత్వం ఉద్యోగులు జగన్‌ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related posts