telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభం..

తమ పార్టీ కార్యాలయాలపై దాడులను నిరసనగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన 36 గంటల దీక్ష గురువారం ఉదయం ప్రారంభమైంది. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో దీక్ష చేపట్టారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి రేపు రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు నిరసన దీక్ష కొనసాగుతోంది. మంగళగిరి టీడీపీ ఆఫీస్‌లో పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ మధ్యలోనే చంద్రబాబు నిరసన దీక్షకు కూర్చున్నారు.

Chandrababu: ప్రారంభమైన టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష

కాగా, దీక్షకు మద్దతుగా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున‌ టీడీపీ కేంద్ర కార్యాలయానికి పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివ‌స్తున్నారు. నిరసన దీక్షలో చంద్రబాబుతో పాటు నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, ఆలపాటి రాజా, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, గద్దే రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts