telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నేడే జగనన్న విద్యా దీవెన పంపిణీ -ఆదోనిలో సీఎం జగన్ సభ

ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఇవాల్టి నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న… తరుణంలో జగనన్న విద్యాకానుక కిట్లను అందించనున్నారు.

కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వీటి పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Andhra Pradesh's focus is on making students future-ready: CM- The New  Indian Express

అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 47 లక్షల 40 వేల 421 మంది విద్యార్థులకు రూ. 931.02 కోట్ల ఖర్చుతో జగనన్న విద్యా కానుక కిట్లు అందించనున్నారు. ప్రతీ విద్యార్థికీ దాదాపు రూ. 2 వేల విలువైన వస్తువులు ఆ కిట్‌లో ఉంటాయి.

Games and films to improve English skills among govt school students in AP

2020 -21 విద్యా సంవత్సరంలోరూ. 648.10 కోట్ల వ్యయంతో 42,34,322 లక్షల మంది విద్యార్ధులకు అందించగా.. 2021 -22 విద్యా సంవత్సరంలోరూ. 789.21 కోట్లు- ఖర్చు చేసి 45,71,051 లక్షల మందికి అందించారు. ఇప్పటివరకు జేవీకే కోసం చేసిన మొత్తం వ్యయం 2,368.33 కోట్లుగా ఉంది.

Andhra CM Jagan launches 'Jagananna Vidya Kanuka' scheme for govt schools -  Video

ప్రతి ఏటా రూ. 24 వేల వరకు ఖర్చయ్యే ఈ స్డడీ మెటీ-రియల్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు ఉచితంగా అందించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతిలో చేరబోతున్న 4.7 లక్షల మంది విద్యార్ధులకు రూ. 500 కోట్ల ఖర్చుతో రూ. 12 వేల విలువ చేసే ట్యాబ్‌లు ఉచితంగా ఈ సెప్టెంబర్‌ నెలలోనే ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్నారు.

Related posts