telugu navyamedia
సినిమా వార్తలు

‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ రిలీజ్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. మలయాళ ‘లూసిఫర్’కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

తాజాగా గాడ్ ఫాద‌ర్ నుంచి మెగాస్టార్ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు ఓ వీడియోను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో చిరు నళ్ల కద్దాలు పెట్టుకుని, చేతికి వాచీతో, జేబులో పెన్నుతో ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనిపించాడు.

ఇక వీడియోలో రోడ్డుకు ఇరువైపులా జనం జెండాలు పట్టుకుని నిలబడగా మధ్యలో ఓ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి చిరు దిగి స్టైలిష్‌గా నడుచుకుంటూ లోనికి వెళ్లాడు. ఆయన నడకకు తగ్గట్టు తమన్‌ అందించిన నేపథ్య సంగీతం బాగుంది.

చిరంజీవికి ఇది 153వ చిత్రం కాగా ఇందులో నయనతార, సత్యదేవ్‌, దర్శకుడు పూరి జగన్నాథ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు .

Related posts