telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీదేవి లేనిదే ఆ సినిమా లేదు… : మెగాస్టార్

JVAS

మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి హీరోహీరోయిన్లుగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. 1990లో విడుదలైన ఈ చిత్రం మే 9తో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా… ఈ విషయాన్ని గుర్తుచేస్తూ వైజయంతీ మూవీస్ ఇప్పటికే ఒక వీడియోను విడుదల చేసింది. తాజాగా చిరంజీవి ఓ వీడియో ద్వారా తన మనోభావాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆయన శ్రీదేవి గురించి మాట్లాడుతూ .. “శ్రీదేవి లేనిదే ఈ సినిమా లేదు .. ఈ సినిమా .. ఈ పాత్ర కేవలం శ్రీదేవి కోసమే తయారయ్యాయా అనిపిస్తుంది. దేవతగా ఆ పాత్రలో శ్రీదేవిని తప్ప మరొకరిని ఊహించుకోలేము. తన అందచందాలతో .. హొయలతో .. చిలక పలుకులతో .. అమాయకపు చూపులతో .. శ్రీదేవి ఆ పాత్రను అత్యద్భుతంగా చేసింది. ఇప్పటికీ అతిలోక సుందరి అంటే శ్రీదేవే గుర్తొస్తుంది. అంతగా ఆమె ఆ పాత్రతో ప్రభావితం చేసింది. అలాంటి శ్రీదేవితో కలిసి నటించడం ఒక అందమైన అనుభూతి. ఆమెతో డాన్స్ చేయడానికి నేను పోటీ పడవలసి వచ్చింది .. శ్రమ పడవలసి వచ్చింది” అంటూ చెప్పుకొచ్చారు.

Related posts