telugu navyamedia
క్రీడలు

సౌరవ్ గంగూలీ కీల‌క ప్ర‌క‌ట‌న ..త్వరలోనే సరికొత్త ప్రయాణం..

బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్ సౌరవ్​ గంగూలీ ట్విటర్‌ వేదికగా కీలక ప్రకటన చేశారు. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నట్లు సౌరవ్ గంగూలీ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

2022 సంవత్సరంతో నా క్రికెట్‌ కెరీర్‌లో 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1992లో క్రికెట్‌లో నా జర్నీ స్టార్ట్‌ అయింది. ఈ 30 ఏళ్లలో నాకు క్రికెట్ ఎంతో ఇచ్చింది.. ముఖ్యంగా నేను ఈ స్థాయికి చేరుకోవడానికి నాకు సహకరించిన, నా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఈరోజు నుంచి కొత్త జీవితాన్ని ప్లానింగ్‌ చేయాలనుకుంటున్నా.. ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నా. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న నాకు ఎప్పటిలాగే మద్దతు ఉంటుందని అనుకుంటున్నా అంటూ రాసుకొచ్చాడు.

ఇక గంగూలీ త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో గంగూలీ రెండుసార్లు బేటీ కావడం పొలిటికల్‌ ఎంట్రీ ఖాయమని వార్తలు వస్తున్నాయి. పొలిటికల్‌ ఎంట్రీ కోసం బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి గంగూలీ తప్పుకునే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గంగూలీ స్థానంలో ప్రస్తుత బీసీసీఐ సెక్రటరీ జై షా అధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts