telugu navyamedia
క్రీడలు వార్తలు

కోచ్ నిర్ణయాన్ని కాదని సూపర్ ఓవర్ వేసా : అక్షర్ పటేల్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఢిల్లీ తరపున అక్షర్‌ పటేల్‌ సూపర్‌ ఓవర్‌ వేయగా.. అతని స్పిన్‌ ఆడడంలో విఫలమైన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్‌ కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ రషీద్‌ ఖాన్ వేసిన ఆఖరి బంతికి సింగిల్‌ తీసి విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌ లో అక్షర్ పటేల్ సూపర్ ఓవర్ వేయడానికి గల కారణాన్ని వెల్లడించారు. వాస్తవానికి ఈ సూపర్ ఓవర్‌ తాను వేయాల్సిందని, కోచ్ రికీపాంటింగ్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడని ఆ ఆవేశ్ ఖాన్ తెలిపాడు. ఇక ”రిషబ్‌ పంత్‌ దగ్గరకు వెళ్లి ఏం చెప్పావని.. బంతి నీ చేతిలోకి ఎలా వచ్చిందో” చెప్పాలని అక్షర్‌ను ప్రశ్నించాడు. అప్పుడు నేను పంత్‌ దగ్గరకు వెళ్లి.. ఈ పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉంది. పరుగులు చేయడానికి కష్టంగా ఉంది. బ్యాట్స్‌మన్‌ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ సమయంలో సూపర్‌ ఓవర్‌ను ఫాస్ట్‌ బౌలర్‌ కంటే స్పిన్‌ బౌలర్‌తో వేయడం సమంజసమని పంత్‌ను కన్విన్స్ చేశా. అందులోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ లెఫ్ట్‌ హ్యాండర్ కాబట్టి నా బౌలింగ్‌లో ఆడడానికి కాస్త ఇబ్బంది పడుతాడు. అందుకే సూపర్‌ ఓవర్‌ నేను వేస్తా అని పంత్‌కు తెలిపా” అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.

Related posts