telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీకి ధైర్యముంటే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి : కవిత

kavitha actor

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు, సినీ నటి కవిత విమర్శల వర్షం కురిపించారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో  మాట్లాడుతూ ప్రభుత్వ చేతకాని తనం వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందన్నారు. ఉపాధి లేక ఎంతో మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికులవి ఆత్మహత్యలు కావని, అవి కచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని అన్నారు. ఇసుక కొరతతో ఐదు నెలలుగా పని కోల్పోయిన ఒక్కొక్క కార్మికుడికి నెలకు 10వేల చొప్పున రూ.50వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు.

ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించటం లేదని అన్నారు. వైసీపీకి ధైర్యముంటే వెంటనే మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. పంచాయతీల్లో కార్యవర్గాలు లేక కేంద్రం నుంచి రావాల్సిన వేల కోట్ల నిధులు ఆగిపోయాయని అన్నారు. గ్రామాల్లో ప్రజలు కనీస అవసరాలకు అందడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ది చెప్పటానికి భవన నిర్మాణ కార్మికులు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Related posts