telugu navyamedia
రాజకీయ వార్తలు

భారత్ పై చైనా కుట్రలు…

china india

మొదటి వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న భారత్ రెండో వేవ్ లో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అనేక చోట్ల ఇప్పటికే ఆంక్షలు విధిస్తున్నారు.  కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి సహాయం చేసేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి.  ఇక ఇదిలా ఉంటె, కరోనా మహమ్మారి నుంచి ఆదుకోవడానికి చైనా ముందుకు వస్తున్నట్టు ప్రకటించినా… చైనా నుంచి ఆక్సిజన్ ఇండియాకు వెళ్లకుండా కుట్రలు చేస్తోంది.  చైనా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సిచువాన్ ఎయిర్ లైన్స్ సంస్థ భారత్ కు 15 రోజులపాటు కార్గో విమానాలను రద్దు చేసింది.  అంతేకాకుండా చైనాలో ఆక్సిజన్ తయారీదారులు ధరలను 30 నుంచి 40శాతం పెంచగా, చైనాలో సరుకు రవాణా చార్జీలను కూడా 20శాతం మేర పెంచింది.  సిచువాన్ ఎయిర్ లైన్స్ కార్గో విమానాలను రద్దు చేయడంతో ఇతర దేశాల మీదుగా అత్యవసరమైన ఆక్సిజన్, ముడి సరుకు రవాణా చేయాల్సి ఉంటుంది.  కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ చైనా విమానాలను రద్దు చేసి, చార్జీలు పెంచి కుట్రలు చేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే దీని పై భారత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts