telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్‌ : … విలీనం కుదరదు.. ఐదువేల రూట్లలో ప్రైవేట్ బస్సులు..

KCR cm telangana

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం దాదాపు ఐదు గంటల పాటు సాగింది. సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. 49 అంశాలపై సమావేశంలో చర్చించాం. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటించాం. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పటిష్ఠంగా ముందుకు పోవాల్సిన అవసరముంది. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలనిచ్చాయి. గత ప్రభుత్వంలో తీసుకున్న చర్యల వల్ల ఆర్థిక మాంద్యం ప్రభావం తగ్గింది. రవాణారంగంలోనే కాస్త ప్రతికూల వృద్ధిరేటు ఉందని సీఎం వివరించారు.

5100 బస్సులకు రూట్‌ పర్మిట్లు ఇవ్వాలని కేబినెట్‌ ఏకగ్రీవంగా నిర్ణయించిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఆర్టీసీ కార్మికులు అనాలోచితంగా, అర్ధరహితంగా సమ్మెకు వెళ్లారని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదని కేబినెట్‌ తీర్మానించిందని వెల్లడించారు. నవంబర్ 5 లోగా కార్మికులు విధులకు హాజరవ్వాలని ప్రభుత్వం సూచిస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

Related posts