telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మొసళ్ళతో కలిసి గోల్ఫ్…!

Alligator

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో మనుషులతో పాటుగానే మొసళ్లు కూడా రోడ్లపైన, స్విమ్మింగ్ పూల్ లో, వాషింగ్ మెషిన్లలో, డోర్ల దగ్గర దర్శనమిస్తూ ఉంటాయి. తాజాగా ఓ మొసలి ఏకంగా గోల్ఫ్ కోర్ట్‌లోకే వచ్చేసింది. గోల్ఫ్ ఆడుతున్న స్టీల్ ఎఫెర్టీ అనే వ్యక్తి సరిగ్గా గోల్ కొట్టే సమయంలో నాలుగు, ఐదు అడుగుల దూరం నుంచి మొసలి వెళ్లడం కనిపించింది. అయినప్పటికీ.. స్టీల్ తన పని తాను చేసుకుని పోయాడు. మొసలి కూడా పక్కనుంచే ఎటువంటి హాని చేయకుండా వెళ్లిపోయింది. తాను చిన్నప్పటి నుంచి సర్ఫింగ్ చేయడం వల్ల ఎన్నో మొసళ్లను చూస్తూనే పెరిగానని స్టీల్ తెలిపాడు. మొసలి తనకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించలేదని.. పక్కనే ఉన్న సరస్సులోకి వెళ్లిపోయిందని చెప్పుకొచ్చాడు. అమెరికా మొత్తం గోల్ఫ్ ఆడటం ఒక రకమైతే.. ఫ్లోరిడాలో మొసళ్ల మధ్య గోల్ఫ్ ఆడటం మరో రకమంటూ స్టీల్ చెప్పాడు.

 

View this post on Instagram

 

Golfing in Florida is just different… 🐊

A post shared by Steel Lafferty (@steellafferty) on

Related posts