అంతర్జాతీయ పితృ దినోత్సవం సందర్భంగా ఈరోజు సుహాసిని తనదైన శైలిలో ట్విట్టర్ లో స్పందించారు. నాన్న అంటే ఓ ధైర్యం, ఓ భరోసా అని టీడీపీ నేత నందమూరి సుహాసిని తెలిపారు. అన్నింటికి మించి నాన్న అంటే త్యాగానికి మారుపేరని వ్యాఖ్యానించారు. తండ్రి కన్నబిడ్డలే సర్వస్వంగా బతుకుతాడని అన్నారు. అన్నింటికీ మించి త్యాగానికి మారుపేరు నాన్న అని కొనియాడారు.
కన్నబిడ్డలే జీవితంగా నాన్న బతుకుతాడు. జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు. వాళ్ల సుఖం కోసం రక్తం చిందిస్తాడు. ఈ క్రమంలో తన అవసరాలు, ఆరోగ్యం అన్నింటినీ పక్కనబెడతాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తండ్రి నందమూరి హరికృష్ణతో దిగిన ఫొటోను సుహాసిని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.