telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

టేకాఫ్ అవుతున్న విమానం… ఒక్కసారిగా రన్ వే పైకి దూసుకొచ్చిన కార్

PLane

జర్మనీలోని డస్సెల్‌డోర్ఫ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమిరేట్స్‌కు చెందిన ఏ380 విమానం టేక్‌ఆఫ్‌కు సిద్దమైంది. సరిగ్గా అదే సమయంలో ఫాలో-మీ(ఎయిర్‌పోర్టులలో తనిఖీలకు వాడే కారు) కారు ఒక్కసారిగా రన్‌వేపైకి దూసుకొచ్చి, విమానాన్ని చేజ్ చేసింది. అయినప్పటికీ… విమాన వేగానికి కారు దాన్ని అందుకోలేక పోయింది. విమానం సెకన్లలో గాల్లోకి వెళ్లిపోయింది. నిజానికి విమానం చాలా దూరం వెళ్లిన తరువాతే కారు రన్‌వేపై తనిఖీకు వచ్చినట్టు వీడియోను సరిగ్గా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈ వీడియోను ఎమిరేట్స్ ట్విటర్‌లో పోస్ట్ చేసి.. ‘మీ వల్ల అయితే పట్టుకోండి చూద్దాం’ అంటూ హాస్యంగా క్యాప్షన్ పెట్టింది. ఫాలో-మీ కారును ఎయిర్‌పోర్టులో సహజంగా పైలట్‌కు విమానాన్ని ఎక్కడ పార్కింగ్ చేయాలో చెప్పడానికి, తనిఖీలు నిర్వహించడానికి ఉపయోగిస్తూ ఉంటారు

Related posts