telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆమె చెవిలో గూడుకట్టుకున్న సాలీడు… తరువాత…!

Spider

అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రానికి చెందిన సూజీ టోరస్ అనే మహిళ కొంత కాలంగా చెవి సమస్యతో బాధ పడుతోంది. ఇటీవల కాలంలో గుడుగుడు మంటూ చెవిలో శబ్దాలు వస్తుండటం ఆమె ఆందోళనను మరింత పెంచింది. దీంతో కంగారు పడిన ఆమె వెంటనే ఆస్పత్రికి వెళ్లింది. ఆమె చెవికి ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని తొలుత భావించిన డాక్టర్లు.. కొన్ని మందులు వాడాలని సూజీకి సలహాఇచ్చారు. అవి వాడిన తర్వాత కూడా సూజీ బాధ తగ్గలేదు. సమయం గడిచేకొద్దీ నొప్పి ఎక్కువకాసాగింది. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్లు సూజీని మరోసారి పరీక్షించారు. ప్రత్యేక సాధనాలతో ఆమె చెవిలో చూసిన డాక్టర్లకు నోటమాటరాలేదు. ఎందుకంటే ఆమె చెవిలో పావలా బిళ్లంత ఉన్న సాలీడు గూడు కట్టుకుని ఉంది. ఇదే విషయాన్ని సూజీకీ తెలియజేయడంతో ఆమె భయపడిపోయింది. ఆమెకు ధైర్యం చెప్పిన డాక్టర్లు సాలీడును బయటకు తీశారు. సాలీడు విషపూరితమైందే కానీ అది సూజీని కరవలేదని, కాబట్టి ఆమెకు ఎటువంటి హానీ జరగలేదని వారు పేర్కొన్నారు.

Related posts