telugu navyamedia
ఆరోగ్యం

అన్నం గంజి.. మంచి సౌందర్య పోషకం .. తెలుసా.. !

What are The Uses Of Different Types Of Rices
మనం అన్నం వండేప్పుడు వచ్చిన గంజిని పారేస్తుంటాం లేదా బట్టలకు వాడుతుంటాం.. కానీ దానిలో పోషకాలు తెలియని చాలా ఉన్నాయి. అది తెలియని వాళ్లు గంజి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని భావిస్తుంటారు. గంజిలో ఉండే పోషకాలు గురించి తెలిస్తే దానిని వృధా చేయరు. గంజిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
గంజిలో ఉండే ఆమినో ఆమ్లాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. శరీరానికి బలాన్ని అందించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో గంజి ముఖ్య పాత్ర పోషిస్తుంది. అనేక శారీరక సమస్యలకు ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇది శరీరానికి శక్తిని అందించి కండరాలను దృఢంగా చేస్తుంది. అలసటకు గురికాకుండా చేస్తుంది.
గంజిలో దూది ముక్కను ముంచి మొటాలు ఉన్న ప్రాంతంలో రాసుకున్నట్లయితే మొటాలు నల్లమచ్చలు తగ్గుతాయి. చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. దీనిని శరీరానికి రాసుకుంటే వయస్సు మీద పడటం వలన వచ్చే ముడతలు తగ్గుతాయి. వృద్ధాప్య చాయలను కప్పి ఉంచుతుంది. 
గంజిని జుట్టు కుదుళ్లకు రాసినట్లయితే, వెంట్రుకలు మొదళ్ల నుండి బలంగా ఉంటాయి. ఆరోగ్యమైన ఒత్తైన జుట్టును పొందవచ్చు. 
ప్రతిరోజూ గంజిని త్రాగడం వలన గ్యాస్ సమస్య దూరం అవుతుంది. మలబద్దకం ఉన్న వారు కూడా ఇది తాగితే మంచి ఫలితం కనబడుతుంది. వేడి చేసిన వారు ఇది త్రాగితే చలువ చేస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ల నుండి కూడా ఇది మనల్ని రక్షిస్తుంది.

Related posts