దేశంలో కరోనా కొనసాగుతుంది. అయితే నిన్నటితో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం దేశవ్యాప్తంగా కొత్తగా 71,365 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఒక్కరోజులోనే 1,217 మంది మృతి చెందారు. 1,72,211మంది వైరస్‌ను కొలుకున్నారు.
దేశంలో పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉందని ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా కేసులతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,10,976కి పెరిగింది.
ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.62 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 96.19 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరో వైపు భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రకియ కొనసాగుతుంది. ఇప్పటివరకు కొవిడ్ డోసుల పంపిణీ 170.8 కోట్ల మైలురాయికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం డోసులు 170 కోట్ల 87 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్లు తెలిపారు.