telugu navyamedia
తెలంగాణ వార్తలు

మోదీ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నల్లజెండాలతో నిరసన..

ప్రధాని పార్లమెంట్‌లో తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. బీజేపీని టార్గెట్‌ చేస్తూ.. టీఆర్‌ఎస్ నేతలు వ్య‌తిరేకిరిస్తూ నిర‌స‌లు కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు.

మోది సోమవారం రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో కాంగ్రెస్ అనుసరించిన తీరువల్లే… ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. పార్లమెంటులో మైకులు ఆపేసి… ఎలాంటి చర్చ జరగకుండానే ఆంధ్రప్రదేశ్‌ విభజన చేశారని.. అందుకే తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని… మోదీ ఆక్షేపించారు.

అలాగే ప్రధాని మోది తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు నిరసన‌గా టీఆర్ఎస్ ఆందోళనలకు సిద్ధమైంది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, మోదీ దిష్టిబొమ్మలు దహనం చేసి, నల్లజెండాలతో నిరసన తెలపాలని కేటీఆర్​ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రధాని తెలంగాణ ప్రజల దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని, త్యాగాలను ప్రధాని మోదీ పదే పదే అవమానిస్తున్నార‌ని , వెంటనే ప్ర‌ధాని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని చేసిన దారుణమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు.

Related posts