తులసి మొక్కలో బోలెడు ఔషధ గుణాలున్నాయి. ఏ రూపేణా తీసుకున్నా ప్రయోజనాలే అవేంటో తెలుసుకుందాం రండి…!
* తులసి ఆకుల్ని రోజూ రాత్రి నీళ్లలో నానబెట్టి, ఆ నీటితో ఉదయాన్నే పళ్లు తోముకుంటే నోటి దుర్వాసన రాదు. నోట్లో పొక్కులు ఉన్నా తొలగిపోతాయి. ఈ ఆకుల్ని నీటిలో మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు నోట్లో వేసుకుని పుక్కిలిస్తే గొంతు సమస్యలు తగ్గుతాయి.
* తులసిరసంలో కాస్త తేనె కలిపి తీసుకుంటే… మేలు. ఈ రెండింటికి యాంటీ సెప్టిక్ గుణాలు ఎక్కువ. చర్మ సమస్యలు రానివ్వవు. సాధారణ జలుబు, దగ్గు తగ్గుతాయి.
* నోటి పూతకీ మంచి ఔషధం.
* ఈ ఆకు శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. క్రమం తప్పకుండా తులసి ఆకుల్ని మజ్జిగతో కలిపి తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది.
* నిద్రలేమితో బాధపడేవారు తులసి రసాన్ని
పంచదారతో కలిపి తీసుకోండి.
బడ్జెట్ లో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదు: విజయసాయి రెడ్డి