telugu navyamedia
ఆరోగ్యం

తేనెతో ప్ర‌యోజ‌నాలు..!

ప్రకృతి వరప్రసాదాల్లో తేనె ఒకటి అనే చెప్పొచ్చు,బహుశా ఇందులో ఎలాంటి కల్తీ ఉండ‌దు. ఒకప్పుడు అడవుల్లో మాత్రం లభించే ఈ తేనె ఇప్పుడు పట్టణాల్లో కూడా దొరుకుంది. చాలామంది పొద్దున్నే వేడి నీళ్ళ‌లో తేనె, నిమ్మరసాన్ని కలిపి తాగుతారు. అలాగే రోజు పావు గ్లాసు గోరువెచ్చటి నీళ్లలో రెండు చెంచాల తేనె కలుపుకుని తాగితే బ‌రువు తగ్గుతుంది. తేనెలో ఉన్న ఔషధ గుణాలు అన్నీఇన్నీ కావు..తేనే లో ఉన్నా విటమిన్స్… శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిన్చును.

ఒక కప్పు వేడి పాలలో, చెంచా తేనె కలిపి పిల్లలతో తాగిస్తే అలసట దూరమై పుష్టిగా తయారయ్యేవారు. రెండు చెంచాల తేనె, నాలుగు చెంచాల నిమ్మరసం, చిటికెడు ఉప్పు బాగా కలిపి నోట్లో వేసుకుని పుక్కిలిస్తే, నోట్లో పొక్కులు, దుర్వాసన తగ్గుతాయి. నిమం రసం లో తేనే కలుపుకొని తీసుకుంటే కడుపు ఉబ్బరం , ఆయాసము తగ్గుతుంది. తేనే లో కొంచెం మిరియాలపొడి కలుపుకొని తీసుకుంటే జలుబు తగ్గుతుంది .

అంతేగాక తేనె, నిమ్మరసం మొటిమలు లేని మొహాన్ని పొందటానికి మంచి ఇంటి చిట్కా. ప్రతిరోజూ పొద్దున్నే ఈ రసాన్ని గోరువెచ్చని నీరుతో కలిపి తాగటం వలన చర్మంలో సహజకాంతి వస్తుంది. నిమ్మరసంలో తేనె కలపటం వలన శరీరంలో మెటబాలిజాన్ని పెంచి , ప్రేగుల కదలికను క్రమబద్ధం చేస్తుంది. వృద్ధాప్య సమస్యల్లో తేనె చక్కగా ఉపయోగపడుతుంది, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, చర్మాన్ని బిగువుగా చేస్తుంది. చిన్నపాటి నొప్పులను దూరంచేస్తుంది.

Related posts