telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఆరోగ్యానికి అత్తిపత్తి

Atthipatthi

అత్తిపత్తి (ఆంగ్లంలో Touch-me-not) ముట్టుకుంటే ముడుచుకునే లక్షణం గల మొక్క. అత్తిపత్తి ఆకులు ముట్టుకున్న వెంటనే లోపలివైపుకు ముడుచుకొని వాలిపోతాయి. మళ్లీ కొన్ని నిమిషాల్లో తిరిగి యధాస్థితికి చేరతాయి. వర్షాకాలంలో మన గ్రామాలచుట్టూ నీటితడివున్న ప్రదేశాలలో ఈ మొక్క పెరుగుతుంది. ఇందులో ముళ్ళులేని, ముళ్ళుఉన్న రెండు రకాల మొక్కలు ఉంటాయి. ముళ్ళున్న అత్తపత్తి భూమినుండి జానెడు మొదలు మూరడు వరకు ఎత్తు పెరుగుతుంది. ఆకులు తుమ్మ ఆకులలాగా చిన్నగా ఉంటాయి. కొమ్మలకు ముళ్ళు ఉంటాయి. పూలు ఎరుపుకల్కిసిన ఊదారంగులో ఉంటాయి. ముళ్ళు లేని అత్తపత్తి నేలపై పరచుకొని ఉంటుంది.ఇదికూడా నీరున్న ప్రాంతాలలోనే పెరుగుతుంది. నేలపైన రెండు మూడు గజాలదాకా పాకుతుంది.దీనికి పసుపు రంగు పూలు పూస్తాయి, సన్నటి కాయలుంటాయి. కాయల్లో గింజలు లక్కరంగులో ఉంటాయి.

అత్తిపత్తి ఆకులు మన చేతితో తాకినా, ఏదైనా కీటకం వాలిగా, నీటిచుక్కలు పడినా, పెద్దగా గాలి వీచినా వెంటనే ముడుచుకొనిపోతాయి. అయితే యధాస్థితికి రావడానికి అరగంట నుండి గంట వరకు పడుతుంది. దీనికి కారణం ఆకులు కొమ్మను కలిసే ప్రదేశంలో మందంగా బుడిపెలా ఉండే పత్రపీఠం. మనం ఆకుల్ని తాకినప్పుడు దీనిలోని మృదుకణజాలం నుండి నీరు కాండంలోనికి వెళ్ళి ఫలితంగా పటుత్వం తగ్గిపోయి ఆకులు వాలిపోతాయి. కొంత సమయానికి కాండం నుండి నీరు బుడిపెలోనికి చేరి ఆకులు తిరిగి యధాస్థితికి వస్తాయి. ఈ మొక్కలో వుండే మైమోసిన్ (ఆల్కలాయిడ్) అనే రసాయనం ఉంటుంది.

Atthipatthi-Plant

అత్తపత్తి గుణ ప్రభావాలు : ఇది వాతాన్ని హరిస్తుంది, రక్త శుద్ధిచేస్తుంది, ఋతురక్తాన్ని, మూత్రాన్ని సాఫీగా జారీ చేస్తుంది. ముక్కునుండి కారే రక్తాన్ని ఆపుతుంది. పాత వ్రణాలను మాన్పుతుంది..మేహ రోగాలను, మూల వ్యాధిని, బోదకాలును, కామెర్లను, పొడలను, కుష్ఠును, విరెచనాలను, జ్వరమును, గుండెదడను, శ్వాసకాలను, తుంటినొప్పిని, ఉబ్బురోగాన్ని, స్త్రీరోగాలను హరించి వేస్తుంది.

వీర్యహీనతకు : అత్తపత్తి గింజలు, చింతగింజలపప్పు, నీరుగొబ్బిగింజలు సమంగా తీసుకొని మఱ్ఱిపాలలో ఒకరాత్రి నానపెట్టి తరువాత గాలికి ఆరపెట్టి మెత్తగానూరి శనగ గింజలంత మాత్రలుచేసి గాలికి ఎండపెట్టి నిలువ చేయాలి. రెందు పూటలా పూటకు మూడు మాత్రలు నీటితో వేసుకొని వెంటనే నాటుఆవుపాలు కండచక్కెర కలిపి తాగాలి. నలభై రోజుల్లో వీర్యము పోవడం, శిఘ్రస్కలనం, నపుంసకత్వం, అంగబలహీనత హరించి ధాతుపుష్టి కలుగుతుంది. వేడి, పులుపు, కారం పదార్థాలు నిషేధించి బ్రహ్మచర్యం పాటించాలి.

ఎరుపు, తెలుపు, పసుపు శెగలకు : ఇది ఇతరులు మూత్రం పోసిన చోట మరొకరు మూత్రంపోయటం వలన గానీ, లేక సెగరోగం ఉన్న వారితో సంభోగం జరపటం వల్లగానీ, ఈ సుఖరోగం కలుగుతుంది. ఈ సమస్యకు అత్తపత్తి ఆకు, మంచిగంధంపొడి సమంగా తీసుకొని కలబందగుజ్జుతో మెత్తగానూరి మాత్రలుకట్టి నీడలో గాలికి బాగా ఎండపెట్టి నిలువ చేయాలి. రోజూ రెండు పూటలా పూటకు ఒక మాత్ర మంచినీటితో వేసుకుంటూవుంటే సెగరోగం తగ్గిపోవటమే కాక వీర్యవృద్ది కలుగుతుంది.

Atthipatthi

నారి కురుపులు నశించుటకు : అత్తపత్తి ఆకులు మెత్తగానూరి నారికురుపులపై వేసి కట్టుకడుతుంటే అవి హరించి పోతాయి. గోగూర వంకాయ, మాంసం, చేపలు నిషేధం.

ఆగిన బాహిష్టు మళ్ళి వచ్చుటకు : అత్తపత్తి ఆకుపొడి ఒక భాగము, పటికబెల్లం పొడి రెందు భాగాలు కలిపి పూటకు అరచెంచా పొడి మంచి నీటితో సేవిస్తుంటే ఆగిన బాహిష్టు మరలా వస్తుంది. రాగానే చూర్ణం వాడటం ఆపాలి. బెల్లం, నువ్వులు, గంజి, తీపి పాదార్థాలు వాడాలి.

వీర్యస్తంభనకు : అత్తపత్తి వేర్లను మేకపాలతోగానీ, గొర్రెపాలతోగానీ, గంధంలాగానూరి ఆగంధాన్ని పురుషులు తమ అరికాళ్ళకు మర్థించుకొని ఆ తరువాత రతిలో పాల్గొంటే చాలా సేపటివరకూ వీర్యపతనం కాదు. తీపిపదార్థాలు బాగా వాడుకోవాలి.

Related posts