telugu navyamedia
ఆరోగ్యం

జీరాతో ఆరోగ్యం..!

సాధార‌ణంగా మ‌నం జీల‌కర్ర‌ను వంట‌ల్లో వాడుతాం. ఆహారానికి సుహాస‌న‌తో పాటు రుచిని తీసుకోస్తుంది. ఈ జీల‌క‌ర్ర‌లో అధ్భుత‌మైన ఔష‌దాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఆరోగ్యంతో పాటు అందాన్ని ఇచ్చే జీల‌క‌ర్రలో ఉండే ప్ర‌యోజ‌నాలు తెలుసుకుందాం..
1. ప్ర‌తిరోజు ఉద‌యం ఒక గ్లాసు వాట‌ర్ రెండు స్పూన్ల జీల‌కర్ర‌ను వేసి మ‌రిగించి ఆ వాట‌ర్ క్ర‌మం త‌ప్ప‌కుండా తాగితే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
2. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌రుస్తుంది. ఆక‌లిని పెంచుతుంది. క‌డుపులో ఏర్ప‌డే అల్స‌ర్‌ను నివారిస్తుంది. జీవక్రియ‌ల ఫ‌లితంగా ఏర్ప‌డే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. క‌డుపులో ఉండే ప‌రాన్న జీవుల‌ను నివారిస్తుంది.
3. జీల‌కర్ర‌ ర‌క్తంలో చ‌క్కెర నిల్వ‌ల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రిస్తుంది. అధిక ర‌క్తపోటు స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగుప‌రిచి గుండెకు ర‌క్త స‌ర‌ఫ‌రా సాఫీగా అందేలా సహాయ‌ప‌డుతుంది.
4. ఇందులో ఉండే యాంటీ ఇన్ ప్ల‌మెట‌రీ ల‌క్ష‌ణాలు చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను నివారిస్తుంది. చ‌ర్మం పై ఎర్ప‌డే ముడ‌త‌లు మ‌రియు పొడిబారే స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. చ‌ర్మానికి కావాల‌సిన పోష‌కాల‌ను అందించి ముఖానికి నిగారింపును ఇస్తుంది.
5.ముత్రాశ‌య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. జీరా వాట‌ర్ తీసుకోవ‌డం వ‌ల‌న కిడ్నీలో ఏర్ప‌డే రాళ్ళ‌ను కూడా క‌రుగుతాయ‌ని ఆయుర్వేదిక నిపుణులు చెబుతున్నారు. శ‌రీరంలోను హానీక‌ర‌మైన టాక్సిన్‌ల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. ప్రేగుల్లో ఏర్ప‌డే వ్య‌ర్ధాల‌ను తొల‌గిస్తుంది.
5 క‌డుపులో ఏర్ప‌డే వికారం మ‌రియు క‌డుపు ఉబ్బ‌రంగా ఉండే స‌మ‌స్య‌ల‌ను నివారిస్తుంది. అంతేకాకుండా అతిగా వ‌చ్చు త్రేన్పుల స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. ఉద‌ర ఆరోగ్యాన్ని పెంచుతుంది. మొల‌ల వ్యాధి నుండి ఉప‌శ‌మ‌నాన్నిక‌లిగిస్తుంది.

Related posts