telugu navyamedia
ఆరోగ్యం

వ‌ర్ష‌కాలంలో ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ ఇలా..

వాతావరణం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. కాలాన్ని బట్టి వాతావరణం కూడా మారుతూ ఉంటుంది. వాతావరణాన్ని బట్టి మన శరీరంలో, ఆరోగ్యంలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. వేసవి వచ్చిందంటే చాలు శరీవేడి తాపానికి గురవుతుంది. వర్షాలకాలంలో చర్మం ఇన్ఫెక్షన్. చలికాలంలో చర్మం పొడిబారడం, రాషెష్, గీతలు పడటం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కాబట్టి ఆయా కాలానికి అనుగుణంగా మన ఆరోగ్యానికి రక్షించుకోవడం మన బాధ్యత.

A rainy week ahead | FOX 56 Lexington

కలుషిత ఆహారంతో..
కలుషిత ఆహారంతో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో ఉండే అధిక తేమ మన జీర్ణశక్తిని తగ్గిస్తుంది. బ్యాక్టీరియా, వైరస్ లు, పరాన్నజీవులు, విషపదార్థాల వల్ల ఆహారం, నీరు కలుషితమవటంతో వివిధ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ఛాన్స్ ఉంది. ఈ అనారోగ్యంను వర్షాకాలంలో తప్పించుకోవటం అనివార్యం. వైరస్ వ్యాప్తికి దోహదపడే కలుషిత ఆహారం, చల్లని పదార్థాలను తీసుకోవద్దు.

Specialty food industry sales hit record high in 2015 | 2016-04-21 | Refrigerated Frozen Food

ఇంటి పరిసరాలు..
వర్షాకాలంలో శారీరకంగా, వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడమే కాదు. ఇంటి పరిసరాల గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడటంతో తేమకు ఇంట్లో కొన్ని వస్తువులు తేమ ఉంటాయి. వాటితో ఇల్లంతా ఓ రకమైన వాసనలు వస్తుంటాయి.

20 Exterior Design for Small Houses to Make the Property More Appeling

దోమలు.. ఈగలు..
వానాకాలంలో మనం ఆరోగ్యంగా ఉండాలీ అంటే దోమలు, ఈగలను దరిచేరనివ్వకుండా చూసుకోవాలి. కొన్ని రకాల జ్వరాలు, అంటువ్యాధుల వ్యాప్తికి అవే కారణం అవుతుంటాయి. మనం నివసించే పరిసరాల్లో నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంట్లోగానీ ఇంటి పరిసరాల్లోగానీ దోమలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపు దోమ కాటు ద్వారా డెంగ్యూ, చికన్ గున్యా, మలేరియా వ్యాధులు కూడా వర్షాకాలంలోనే విజృంభిస్తాయి. దోమల సంతతి పెరగటానికి వర్షాకాలం చాలా అనుకూలం కావటంతో వాటి ద్వారా వ్యాపించే ఈ వ్యాధుల వ్యాప్తి అధికం అవుతుంది.

The first case of tropical dengue in the Netherlands. The woman was bitten by a mosquito - World Today News

వర్షంలో తడిసినట్లయితే..
వర్షంలో తడిసినట్లయితే ఇంటికి రాగానే పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తరువాత తడి లేకుండా తుడుచుకోవాలి. ముఖ్యంగా ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు పాటించాలి. వర్షాకాలంలో ఎక్కువగా తడవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. అంటువ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంటికి రాగానే కాళ్ళను గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి.

ayurveda tips for health: ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా చేస్తే ఎంతో ఆరోగ్యమట.. - ayurveda tips for overall health experts say know here all in telugu | Samayam Telugu

జ‌లుబు..
వర్షాకాలంలో తడిసి ఇంటికి వచ్చిన వెంటనే తలస్నానం చేయాలి. తలతడిగా ఉన్నప్పుడు చుండ్రు అధికమవుతుంది. పేలూపడతాయి. తలో చుండ్రు రావడం.. ఆ తర్వాత మొహంపై మొటిమలు రావడం జరుగుతుంది. ఇతర ఇన్ఫెక్షన్లు బాధించే ఛాన్స్ ఉంది. అందుకే తల తడవకుండా గొడుగు లాంటివి ఉపయోగించాలి. లేదంటే జ‌లుబు వ‌చ్చే అవ‌కాశ ముంటుంది.

Monsoon health tips in hindi, rainy season problems and precautions, rainy season in india health and hygiene tips in hindi, मानसून हेल्थ टिप्स इन हिंदी, रैनी सीजन हेल्थ प्रॉब्लम, बारिश के मौसम

Related posts