telugu navyamedia
సినిమా వార్తలు

నా సినిమా విడుదల తేదీ మార్చండి : హృతిక్ రోషన్

Rangoli

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోష‌న్ నటిస్తున్న “సూప‌ర్ 30”, కంగ‌నా “మెంట‌ల్ హై క్యా” చిత్రాలు జూలై 26న బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డనున్నాయ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు అవుతున్న తరుణంలో హృతిక్ అభిమానులు కంగనాపై సోషల్ మీడియాలో విమర్శలు కురిపించారు. దీంతో కంగ‌నా సోద‌రి రంగోలి హృతిక్‌పై ఘాటు విమ‌ర్శ‌లు కూడా చేసింది కూడా ఈ వివాదం బాగా ముదురుతున్న నేప‌థ్యంలో హృతిక్ రోష‌న్ ట్విట్ట‌ర్ వేదిక త‌న సినిమా “సూప‌ర్ 30” విడుదల తేదీని మార్చాలంటూ నిర్మాతలను కోరారు. “మీడియాలో ఓ వ‌ర్గం నా సినిమాను త‌క్కువ చేయాల‌ని చూస్తుంది. ఈ వ్య‌క్తిగ‌త‌, మాన‌సిక బాధ నుండి త‌ప్పుకోవాలంటే నా సినిమా రిలీజ్ డేట్‌ను మార్చాల‌ని నిర్మాత‌ల‌ను కోరుతున్నాను. సినిమా అంతా సిద్ధ‌మైంది. అయినా కూడా మంచి రిలీజ్ డేట్ చూసి నిర్మాత‌లు విడుద‌ల తేదీని మార్చాలి. చాలా కాలంగా నన్ను ఎన్నో అవ‌మానాల‌కు గురి చేసినా, నేను చిరున‌వ్వుతో భ‌రిస్తూ వ‌స్తున్నాను” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Related posts