telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఎన్నికల అధికారులపై మర్డర్ కేసు పెట్టండి : హై కోర్టు

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం ఆర్ విజయభాస్కర్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపింది హైకోర్టు. అయితే ఎన్నికల కౌంటింగ్ లో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదంటూ పిటిషన్ వేశారు విజయభాస్కర్. ఈ పిటిషన్ విచారణ సమయంలోనే మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.  కరోనా సెకండ్ వేవ్ కి ఎన్నికల కమిషన్ కారణం అన్న హైకోర్టు… అధికారులపై మర్డర్ కేసు పెట్టాలని ఆదేశించింది. బహిరంగ సభలు, ర్యాలీలు ఎందుకు అపలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరు వేరే గ్రహం మీద కాలక్షేపం చేస్తున్నారా అంటూ మండిపడింది. కౌంటింగ్ రోజు కచ్చితంగా కోవిడ్ రూల్ పాటించాలని అదహేశించింది. కౌంటింగ్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు..ఎన్ని టేబుళ్లు ఏర్పాటు చేశారు, సిబ్బంది ఆరోగ్యం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో బ్లూ ప్రింట్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Related posts