telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భారత పౌరసత్వ బిల్లుపై .. పెదవి విరిచిన ఐక్యరాజ్య సమితి …

United Nation praised India on fani cyclone

భారత కొత్త పౌరసత్వ చట్టాన్ని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం తప్పుబట్టింది. ఈ చట్టంలో ముస్లింలు మినహాయించడం ద్వారా ప్రాథమికంగా వారిపై వివక్షతను సూచిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే సమీక్షించాలని పిలుపునిచ్చింది. వివాదాస్పదమైన కొత్త చట్టాన్ని అమలు చేయడాన్ని నిరసిస్తూ పోలీసులు, వేలాది విశ్వవిద్యాలయ విద్యార్థుల మధ్య శుక్రవారం ఢిల్లీలో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. పౌరసత్వ సవరణ బిల్లు (CAB)ను బుధవారం పార్లమెంటు ఆమోదించిన నేపథ్యంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మైనారిటీలకు రక్షణగా మాత్రమే ఉద్దేశించినదని ప్రభుత్వం తెలిపింది.

భారతదేశం కొత్త పౌరసత్వం (సవరణ) చట్టం 2019 ప్రాథమికంగా వివక్షతతో కూడుకున్నదని తాము ఆందోళన చెందుతున్నాం’ అని UN మానవ హక్కుల ప్రతినిధి జెరెమీ లారెన్స్ జెనీవాలో జరిగిన ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. కొత్త చట్టం ముస్లిం వలసదారులకు హింసను ఎదుర్కొనే మరో ఆరు మత మైనారిటీలకు అదే రక్షణను ఇవ్వదు. అందువల్ల చట్టం ముందు సమానత్వం పట్ల భారత్ నిబద్ధతను బలహీనపరుస్తుందని దేశ రాజ్యాంగంలో పొందుపరిచినట్టు ఆయన తెలిపారు. కొత్త చట్టాన్ని భారత సుప్రీంకోర్టు సమీక్షిస్తుందని మేము అర్థం చేసుకున్నాము. భారత్ అంతర్జాతీయ మానవ హక్కుల బాధ్యతలతో చట్టం అనుకూలతను జాగ్రత్తగా పరిశీలిస్తుందని ఆశిస్తున్నామని లారెన్స్ చెప్పారు.

Related posts