telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆసుపత్రి నుండి ఇంటికి సచిన్…

Sachin tendulkar

ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ నడుస్తునా విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కేసులు తగ్గుతాయి అనుకున్నారు. అలాగే మొదట్లో కేసులు తగ్గిన ఇప్పుడు మళ్ళీ భారీగా నమోదవుతున్నాయి. ఈరోజు అయితే ఏకంగా లక్షకు పైగా కరోనా కేసులు దేశ వ్యాప్తంగా నమోదయ్యాయి. అయితే మన దేశంలో ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు, రాజకీయనాకులు ఈ కరోనా బారిన పడ్డారు. ఇక తాజాగా భారత క్రికెట్ దిగ్గజం లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆస్పత్రిలో చేరిన సచిన్‌ టెండూల్కర్‌ ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. అయితే సచిన్‌ ఇప్పుడు పూర్తిగా కరోనా నుండి కోలుకొని ఇంటికి వెళ్తున్న సచిన్ కొన్ని రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండనున్నారు.

Related posts