telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

నెల్లూరులో భారీ అగ్నిప్రమాదం

fire building

నెల్లూరులోని కెమికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ట్రాన్స్ ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు పక్కనే ఉన్న బాలాజీ కెమికల్స్ పరిశ్రమకు వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు చెలరేగాయి. నగరంలోని బోడిగాడి తోట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో రసాయనాలు తగలబడుతుండడంతో విషవాయువులు వెలువడే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ట్రాన్స్ ఫార్మర్ కు చెట్ల కొమ్మలు తగలడంతో మంటలు రేగినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం.

Related posts