telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

హ్యూందాయ్‌ వెన్యూ … రికార్డు స్థాయిలో బుకింగ్స్ …

hyundai venue booking record in

హ్యూందాయ్‌ 2019 ముగింపు నాటికి ‘వెన్యూ’ లక్ష బుకింగ్స్‌ను పూర్తి చేసుకొంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారును 2019 మే నెలలో మార్కెట్లోకి విడుదల చేశారు. అక్టోబర్‌ చివరి వరకు 51,257 వాహనాలను విక్రయించగా.. 75,000 బుకింగ్స్‌ వచ్చాయి. ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపే వారిలో దాదాపు 50శాతం మంది బ్లూలింక్‌ కనెక్టడ్‌ కార్‌ టెక్నాలజీ ఉన్న వేరియంట్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ టెక్నాలజీని ఎస్‌ఎక్స్‌ డీసీటీ, ఎస్‌ఎక్స్‌(ఓ)కు మాత్రమే అందజేస్తున్నారు.

తాజాగా ఈ మోడల్‌ కార్లను ఎగుమతి చేయడం కూడా ప్రారంభించింది. ఇటీవల దాదాపు 1400 కార్లను దక్షిణాఫ్రికాకు ఎగుమతి చేసింది. డిసెంబర్‌ 2 నుంచి అక్కడ కూడా వెన్యూ అమ్మకాలను ప్రారంభించనుంది. ప్రస్తుతం కొన్ని మార్కెట్ల అవసరాల నిమిత్తం కుడిచేతివాటం డ్రైవింగ్‌ మోడళ్లను తయారు చేస్తోంది.. తాజాగా ఎడమచేతి వాటం డ్రైవింగ్‌ మార్కెట్ల కోసం ఆ మోడల్‌ను కూడా తయారు చేస్తోంది.

Related posts