telugu navyamedia
రాజకీయ వార్తలు

కరోనా వైరస్‌ మనకు ఎన్నో పాఠాలు నేర్పింది: ప్రధాని మోదీ

modi on jammu and kashmir rule

కరోనా వైరస్‌ విజృంభణ ఎన్నో పాఠాలు నేర్పిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంచాయతీ రాజ్‌ దినోత్సవం పురస్కరించుకుని ఈ రోజు ఈ-గ్రామ స్వరాజ్‌ పోర్టల్‌, మొబైల్‌ యాప్ ను ఆయన ప్రారంభించారు. వీటి ద్వారా ఎన్నో సేవలు పొందవచ్చని తెలిపారు. దీని వల్ల బ్యాంకు రుణాలు తీసుకోవడం చాలా సులభమని చెప్పారు. దేశంలో సర్పంచ్‌లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ దేశంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలంగా ఉంటేనే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రస్తుతం లక్షా 25 వేల పంచాయతీల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుతున్నాయని వివరించారు.

గ్రామాల్లో కరోనా విజృంభించకుండా సర్పంచ్‌లు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. జీవితంలో ఎదురవుతున్న పరిస్థితుల నుంచి మనం ఎల్లప్పుడూ నేర్చుకోవాల్సి ఉంటుంది. పరిస్థితులు దుర్భరంగా ఉన్న సమయంలో మనం ఎలా వ్యవహరిస్తామన్న విషయాన్ని కరోనా విపత్కర పరిస్థితులు మనకు గుర్తు చేశాయని మోదీ చెప్పారు.’మనపైనే మనం ఆధారపడి జీవించాలని, ఇతరులపై ఆధారపడొద్దన్న విషయాన్ని కరోనా సమస్య స్పష్టం చేసిందన్నారు.

Related posts