telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అంతర్జాతీయంగా ఏకాకిగా పాక్ … అక్కసుతో అన్ని దారులు మూసేసే ఆలోచన..

pak decided to close all routes to india

పాక్, కశ్మీర్ అంశంలో అంతర్జాతీయంగా ఏకాకి అయ్యింది. దీంతో దిక్కుతోచని స్థితిలోకి చేరుకుంది పాక్. ఇప్పుడు అన్నిరకాలుగా తన అక్కసును వెళ్లగక్కుతోంది. మొన్న సట్లేజ్ నదిపై నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా భారత్, పాక్ మధ్య నడిచే రైలును కూడా నిలిపివేసింది. భారత్‌తో వాణిజ్య సంబంధాన్ని కూడా తెగతెంపులు చేసుకుంది. తాజాగా ఇతర దేశాలు భారత్‌ వచ్చే అన్ని దారులను మూసేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ విషయాన్ని పాక్ మంత్రి ఫవాద్ హుస్సైన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

పాక్ గుండా భారత్‌కు వెళ్లే అన్ని దారులూ మూసివేసే అంశాన్ని మా ప్రధాని పరిశీలిస్తున్నారు. భారత-ఆఫ్ఝనిస్థాన్‌ల వాణిజ్యంపై ప్రభావం చూపేలా గగనతలంతో పాటూ రోడ్డు మార్గాలపై కూడా ఆక్షంలు విధించే ప్రతిపాదనపై క్యాబినెట్ సమావేశంలో చర్చించాం. కశ్మీర్ అంశం తెరపైకి తెచ్చింది మోదీ అయితే ముగింపు పలికేది మేమే,’ అని ఆయన ట్వీట్ చేశారు.

Related posts