telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ లో మరో .. అత్యాచారం … అపార్ట్మెంట్ కల్చర్ కారణం..

minor raped child in visakha

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యాచార ఘటన పై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ నలుగురు నరరూప రాక్షసులను బహిరంగంగా ఉరి తీయాలి లేదా ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రియాంకకు జరిగిన దారుణం అందరిని షాక్ కు గురి చేసింది. ఆ షాక్ నుంచి ఇంకా ఎవరూ తేరుకోనేలేదు. ఇంతలోనే హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మరో యువతి అత్యాచారానికి గురైంది. స్నేహితుడే ఈ దారుణానికి ఒడిగట్టాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన యువతి హైటెక్ సిటీకి సమీపంలోని నిజాంపేట ఈశ్వర్ విల్లాస్ రోడ్డులో అపార్ట్ మెంట్ లో తన సోదరితో కలిసి ఉంటోంది. ఆమెకు జాయల్ చంద్(27) స్నేహితుడు.

శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి దగ్గరికి వచ్చిన జాయల్ చంద్ అమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పరారయ్యాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన సోదరి.. ఇంట్లో జరిగింది చూసి షాక్ తింది. అప్పటికే బాధితురాలు అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు అందరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అమ్మాయిల భద్రత గురించి టెన్షన్ పడుతున్నారు. ఇంటి బయటే కాదు ఇంట్లో కూడా రక్షణ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Related posts