telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నయన్ స్థానంలో త్రిష…?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను ఒకే చేస్తున్నారు. అయితే మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . ఇక ఈసినిమా తర్వాత మెగాస్టార్ మరో మూడు సినిమాలు చేయబోతున్నారు. వీటిలో మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. అయితే ఈ సినిమాను మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్  చేసారు. దీనికి తెలుగులో మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఎప్పటినుండో ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త హల చల్ చేస్తుంది.  ఈ సినిమాలో సౌత్‌ ఇండియా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారని తీసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు నయన్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు నయన్ స్థానంలో మరో లేడీ సూపర్ స్టార్ త్రిష ను చిత్రబృందం సంప్రదించినట్లు… దానికి త్రిష కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చిరు సోదరి పాత్రలో నయన్ కంటే త్రిష బాగా సెట్ అవుతుంది అని చిత్రబృందం భావిస్తుందట… చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.. చిరు చెల్లులుగా ఎవరు చేస్తారు అనేది.

Related posts