telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కృష్ణా, విజయవాడ నగర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు…

rain hyderabad

వాయుగుండం ప్రభావంతో కృష్ణాజిల్లా, విజయవాడ నగర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం, కొన్నిచోట్ల విరిగిపడిన చెట్లు, హోర్డింగ్ లు కనిపిస్తున్నాయి. విజయవాడలో పలు రహదారులు చెరువులను తలపిస్తున్నయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. విజయవాడలో విరామం లేకుండా జోరువాన, పలు ప్రాంతాల్లో విద్యుత్ కు ఆటంకం కలిగిస్తుంది. వర్షం నీరు, డ్రైనేజీ నీటితో నదులను తలపిస్తున్నయి రోడ్లు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో రోడ్లపైకి మురుగునీరు వస్థుందారంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. రహదారులన్నీ నీటికుంటలుగా మారడంతో వాహనదారులు ఇక్కట్లు తప్పడం లేదు. భారీ వర్షాలతో ఇళ్లకే ప్రజలు పరిమితమయ్యారు. ఆయా ప్రాంతాల్లో ఇళ్లల్లో మోకాళ్ల లోతులో నీరు చేరడంతో ప్రజలు అగచాట్లు పడుతున్నారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్, మొగల్రాజపురం, సింగ్ నగర్, పాయకాపురం, ఎల్.బి.ఎస్.నగర్, భారతీనగర్, పాలిక్లినిక్ రోడ్, బీసెంట్ రోడ్ వంటి ప్రాంతాలు అని జలమయం అయ్యాయి.

Related posts