telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కనులముందు నీ రూపం..

అక్షరం రాని నాతో
అపురూపమైన పదజాలం
వెల్లువిరిసేలా చేసిన మహర్షివా
మాటలు నేర్పిన మాంత్రికుడివా
కవితా రసికుడివా
కనులముందు నీ రూపం
కాదు నీవూహ కూడ
నను కవయిత్రిని చేస్తుంది
ప్రియతమా నీ ఆలోచనే
ఓ మత్తు కదా కవయిత్రినేకాదు
నీవు ఎదురుగ వుంటే
రచయిత్రినై ప్రేమాయణం
రాస్తానేమో కదా ……???
గుండె నిండా దిగులు
మనసంతా బాధ
జీవితం ఇంత బరువా…???
కల్మషంలేని మనిషికి
కష్టాలే వరమా …?
ఎవరు లేని ప్రాణికి
దేవుడే కదా దిక్కు ….?
మనసు ఓదార్పుకోసం
మనిషి మమతకోసం
ప్రాణం మృత్యువు కోసం
ఎదురు చూస్తుంది
జీవన పోరాటంలో
అలసిపోయిన
ఓ ప్రాణి …..

Related posts