ఈ ఏడాది ఆరంభంలోనే ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే.. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ‘రాధేశ్యామ్’ చిత్రంలో అలాగే అక్కినేని అఖిల్‌తో కలిసి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తోంది. అయితే తన వివాదాస్పద వ్యాఖ్యలతో గత రెండ్రోజులుగా వార్తల్లో నిలుస్తున్న పూజాహెగ్డే పేరు మరోసారి సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. దీనంతటికి కారణం ఓ చిన్నారి. సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో నీ అభిమాన హీరోయిన్ ఎవరు? పెద్దయ్యాక ఏమవుతావు అని ఓ వ్యక్తి ఆ చిన్నారిని ప్రశ్నిస్తుండగా నేను పెద్దయ్యాక హీరోయిన్ పూజా హెగ్డే అవుతా. ఎందుకంటే పూజా హెగ్డే చాలా బాగుంటుంది. నాకు ఆమె అంటే చాలా ఇష్టం అంటూ ముద్దు ముద్దుగా సమాధానాలు ఇస్తూ సరదాగా కనిపించింది చిన్నారి. దీంతో ఈ వీడియో వైరల్ అవడంతో పూజాహెగ్డే స్పందించారు. పూజా ఆ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ”ఈ చిన్నారి వీడియోతో ఈ రోజు సంతోషకరంగా మారి పరిపూర్ణం అయింది. అమ్మాయి బుగ్గలు ఎంత బాగున్నాయో..! ఇంతటి క్యూట్ అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు. సమయం చూసుకొని నిన్ను కలుస్తా. నాపై నీకున్న ప్రేమకు ఈ ముద్దులు పంపుతున్నా” అని చెప్పుకొచ్చింది.
@hegdepooja #iwillbecomeheroinpoojahegde
From @Rethushananaidupasam :
“Nenu heroine Pooja Hegde avtha”
“నేను హీరోయిన్ పూజా హెగ్డే అవుతా” pic.twitter.com/xyqv7oERqc— 🇮🇳మహేష్ పాశం. Mahesh Pasam.🇮🇳 (@mahesh_pasam) November 10, 2020