కొన్ని రోజుల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటున్నాడు. తన 26వ సినిమాగా ‘పింక్’ రీమేక్‌ని ఎంచుకున్నాడు. హిందీ, తమిళ్ భాషల్లో ‘పింక్’ చిత్రాన్ని నిర్మించిన బోని కపూర్, దిల్ రాజుతో కలిసి నిర్మిస్తుండగా వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకి ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కథలో తెలుగు నేటివిటీ, పవన్ ఇమేజ్‌కి తగ్గట్టు మార్పులు చేశారని, పవన్ పక్కన ఓ కథానాయిక కూడా ఉండబోతుందని ఫిలింనగర్ సమాచారం. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మే 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కొద్ది గ్యాప్ తర్వాత పింక్ రీమేక్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాల స్పీడ్ పెంచాడు. క్రిష్ దర్శకత్వంలో ఓ చారిత్రాత్మక చిత్రం చేయనున్నాడు. ఈ సినిమాలో పవన్ సరసన బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించనున్నట్టు తెలుస్తుంది. కీరవాణి చిత్రానికి మంచి బాణీలు సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని రూపొందించనున్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా రూపొందనున్న క్రిష్- పవన్ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.