telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ తమిళ కమెడియన్ వివేక్ కు మాతృవియోగం

Vivek

ప్రముఖ తమిళ కమెడియన్ వివేక్ తల్లి అనారోగ్యంతో మరణించారు. వివేక్ త‌ల్లి ఈరోజు అనారోగ్యంతో బుధ‌వారం చెన్నైలో క‌న్నుమూశారు. వ‌య‌సు మీరిన వివేక్ అమ్మ‌గారు కొంత‌కాలంగా వ‌య‌సు మీర‌డం వ‌ల్ల వ‌చ్చిన ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో గ‌త కొంత‌కాలంగా ఆమె బాధ‌ప‌డుతున్నారు. కొన్నేళ్ల క్రితం కొడుకుని కోల్పోయిన వివేక్‌.. త‌ల్లిని కోల్పోవ‌డంతో విషాదంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు వివేక్ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. త‌మిళంలో ర‌జ‌నీకాంత్‌, విజ‌య్‌, అజిత్ స‌హా ప‌లువురు స్టార్ హీరోల‌తో న‌టించిన ప్ర‌ముఖ సీనియ‌ర్ క‌మెడియ‌న్ వివేక్‌. ఈయ‌న న‌టించిన ప‌లు చిత్రాలు తెలుగులో అనువాదమ‌య్యాయి. శివాజీ, అప‌రిచితుడు.. ఇలా ప‌లు అనువాద చిత్రాల‌తో వివేక్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడే.

Related posts