మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తాజాగా తెలుగులో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘లెఫ్టినెంట్’ అనే టైటిల్ని నిర్ణయించారు. ఈ రోజు దుల్కర్ జన్మదినం కావడంతో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తూ నిర్మాణ బృందం అతనికి శుభాకాంక్షలు తెలిపింది. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో పనిచేస్తున్న రామ్ అనే యువకుడి ప్రేమకథగా దీనిని రూపొందిస్తున్నారు. అందుకే ఫస్ట్ లుక్ లో టైటిల్ కింద ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనే ట్యాగ్ లైన్ ను ఉంచారు. దీనికి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తారు. ఇక మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ అనతికాలంలోనే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. రొమాంటిక్ హీరోగా అమ్మాయిల మనసులను దోచుకున్నాడు. ‘మహానటి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి గుర్తింపును, క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
previous post