telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ ఎడారిగా మారుతుంది : జీవన్ రెడ్డి

ఏపీ చర్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకపోవడంతో తెలంగాణ ఎడారిగా మారుతుంది అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం.. కొత్త ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవాలి. రాయలసీమ ఎత్తిపోతల అక్రమ ప్రాజెక్టు ను నిలుపుదల చేసేలా తెలంగాణ అడ్డుకోలేకపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లో రెండు టీఎంసీ లను సమర్థవంతంగా తెలంగాణ వినియోగించు కోలేకపోతుంది. అలాంటిది మూడో టీఎంసీ లిఫ్ట్ చేయడం లో మతలభేంటి అని అడిగారు. కమీషన్లకు కక్కుర్తి పడి మూడో టీఎంసీ చేపడుతున్నారు. కాళేశ్వరం మూడో టీఎంసీ ని సాకూగా చూపి.. జగన్ రాయలసీమ ఎత్తిపోతల చేపడుతున్నారు.  ఎస్.ఎల్.బి.సీ ఏడేళ్లు అవుతున్న పూర్తి చేయడం లేదు. కృష్ణా జలాలు అక్రమంగా తరలిస్తుంటే స్పందించడం చేతకాని వ్యక్తి .. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు అడిగే నైతిక హక్కు లేదు. కరోనా విజృంభిస్తుంటే .. సాగర్ లో బహిరంగ సభ పెట్టడంలో కేసీఆర్ ఆలోచన ఏంటి అని అడిగిన ఆయన రాయలసీమ ఎత్తిపోతలను అడ్డుకోవడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా వైఫల్యం చెందారు అని అన్నారు.

Related posts