telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

వల వేసి సొరచేపను పట్టారు… ఆ తరువాత… !

Shark

ఫ్లోరిడాకు చెందిన ముగ్గురు వ్యక్తులు వల వేసి కొక్కెం ద్వారా ఓ సొరచేపను పట్టారు. వీడియోను పరిశీలిస్తే ఆ ముగ్గురు ఆ సొరచేపను ఒడ్డుకు తీసుకొచ్చి దాని మూతికి ఉన్న కొక్కెంను లాగడానికి ప్రయత్నించారు. అది ఎంతకీ రాకపోగా.. చేప నోట్లో నుంచి రక్తం రావడం మొదలైంది. తరువాత హ్యాంగ్లర్‌ను తీసుకొచ్చి కొక్కెంను కోశారు. అనంతరం సొరచేపను ఏం చేయకుండా వైల్డ్‌లైఫ్ అధికారులు తీసుకొచ్చిన నూతన నిబంధనలను పాటిస్తూ సొరచేపను జాగ్రత్తగా తిరిగి సముద్రంలో వదిలేశారు. సముద్రజీవులకు సంబంధించి ఫ్లోరిడా వైల్డ్‌లైఫ్ అధికారులు కొత్త సంస్కరణలను తీసుకొస్తున్నారు. సముద్రంలోని హ్యామర్ హెడ్, లెమన్ షార్క్, టైగర్ షార్క్, సాఫిష్.. ఇలా 26 రకాల సొరచేపలను పట్టడం నేరం. జులై 1 నుంచి అమలుచేయబోతున్న ఈ కొత్త సంస్కరణ బట్టి.. సొరచేపను ఒడ్డుకు తీసుకురావడం కూడా నేరమే. మత్స్యకారులకు సముద్రంలో కొక్కెం ద్వారా ఏదైనా సొరచేప చిక్కినా.. సముద్రంలోనే దాన్ని విడిచిపెట్టాలి. ఒకవేళ తెలియక పట్టినా.. వెంటనే దాన్ని వదిలేయాలి.. లేదంటే కఠినశిక్షలు విధిస్తామంటోంది ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ కమిషన్.

Related posts