telugu navyamedia
క్రీడలు వార్తలు

కొరటాలతో మరోసారి ఎన్టీఆర్…

టాలీవుడ్‌ అగ్రహీరోల్లో ఎన్‌టీఆర్ కూడా ఒకరు. తన నటన, డాన్సులతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఎన్‌టీఆర్ నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను జక్కన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత వచ్చే పాన్ ఇండియా రేంజ్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ఎన్‌టీఆర్ తన తదుపరి చిత్రాన్ని ఎంచుకోవాలి. అయితే ఎన్‌టీఆర్ తన 30వ చిత్రంగా ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో అనౌన్స్ చేసాడు. ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే పేరును ఖరారు చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ తన తదుపరి సినిమా త్రివిక్రమ్ తో కాదని కొరటాల శివతో అని తాజాగా ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ పోస్ట్ కొరటాల తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ మీతో మళ్ళీ కలిసి సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది అని ట్విట్ చేసాడు. అయితే వీరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండనుంది అనేది.

Related posts