telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కేంద్రంలో ఒక ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు : చంద్రబాబు

chandrababu gift on may day

కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసార్రి విరుచుకుపడ్డారు. అవసరమైనప్పుడు కేంద్ర బలగాల్ని పంపమంటే కేంద్రం ప్రభుత్వం పంపలేదని, అవసరం లేనప్పుడు పంపుతున్నా చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎగ్జిట్‌ పోల్స్‌పై స్పందించిన ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ డిమాండ్లను నెరవేర్చడానికి బీజేపీకి ఉన్నఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. కేంద్రంలో ఒక ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు చేశామని తెలిపారు.

అన్ని పార్టీలు ఈవీఎంలను కాపాడుకోవడంలో బిజీగా ఉన్నాయని అన్నారు. ఈవీఎంలు ఎత్తుకెళ్లే అవకాశాలు చాలా తక్కువని, ఫ్రీక్వెన్సీ మార్చవచ్చునని బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. రూ.9 వేల కోట్లు ఖర్చుపెట్టి వీవీప్యాట్లు తీసుకొచ్చారన్నారు. ఫామ్‌-7 ద్వారా టీడీపీకి పడే ఓట్లను తొలగించారని విమర్శించారు. ఐపీ అడ్రస్‌లు అడిగితే ఇవ్వలేదపి, తిసేశామని చెప్పారని చంద్రబాబు అన్నారు.ఇంకా ఫలితాలు రాక ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం ఏర్పాటు చేసుకుందని ఆయన ఎద్దేవా చేశారు.

Related posts