telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భారత చట్టంపై పాక్ అత్యుత్సాహం.. అసెంబ్లీ లో పౌరహక్కుల చట్టంపై తీర్మానం…

reply to CAA topic in pak assembly

మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై పాక్ జాతీయ అసెంబ్లీలో తీర్మాణం చేయడంపై కేంద్ర విదేశాంగశాఖ స్పందించింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు పాక్ లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాక్ తీర్మాణాన్ని సృష్టంగా తిరస్కరిస్తున్నామని తెలిపింది. ఈ చట్టాన్ని కూడా జమ్మూకశ్మీర్, లఢఖ్ ఇష్యూపై పాక్ తన తప్పుడు కథనాన్ని మరింత ముందుకు తెచ్చే ప్రయత్నమని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. భారతదేశం సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్ నిరంతరాయంగా మద్దతు ఇవ్వడానికి దీనిని ఉపయోగించుకుంటుంది. ఇటువంటి ప్రయత్నాలు విఫలమవుతాయని మేము విశ్వసిస్తున్నాము అని రవీష్ తెలిపారు.

పాక్ తీర్మానం కేవలం స్వదేశంలో మతపరంగా మైనారిటీలను హింసించడం నుండి దృష్టిని మళ్లించడానికి పేలవమైన మారువేషంలో చేసిన ప్రయత్నమని రవీష్ అన్నారు. జెనీవాలో ప్రపంచ శరణార్థుల సదస్సుతో పాక్ ప్రాధాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ…భారత అంతర్గత వ్యవహారాల్లో అసందర్భ, అనవసరమైన వ్యాఖ్యలు చేసి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన కుట్రపూరిత రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకురావడానికి మరోసారి తెలిసిన అబద్ధాలను బహుళ పక్ష వేదికపైకి తెచ్చారని ఆయన అన్నారు. గడిచిన 72ఏళ్లుగా పాక్ క్రమబద్దంగా తమదేశంలోని మైనార్టీలను వేధిస్తూ ఉందని చాలామందిని బలవంతంగా భారత్ కు పారిపోయేలా చేస్తుందని భారత్ తెలిపింది. పాక్ ఆర్మీ 1971లో అప్పటి తూర్పు పాక్ లో చేసిన పనిని ప్రపంచం మర్చిపోతుందని ఇమ్రాన్ ఖాన్ అనుకుంటున్నారని,పాక్ తప్పనిసరిగా వాళ్ల దేశంలోని మైనార్టీలను సహ అన్ని మతస్థులను కాపాడాలని, వాళ్ల హక్కులకు భంగం కలగకుండా వ్యవహరించాలని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

Related posts