telugu navyamedia
వార్తలు సామాజిక

భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం

Mumbai Heavy Rains

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత 15 సంవత్సరాల్లో ఇంతగా వర్షం కురవడం ఇదే మొదటిసారి కావడంతో చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల అపార్టుమెంట్లలోని సెల్లార్లలోకి నీరు ప్రవేశించడంతో వేలాది వాహనాలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముంబైతో పాటు థానే, పుణే తదితర జిల్లాల్లో రెడ్ అలర్ట్ ను ప్రకటించింది.

మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. వరద నీటిలో చిక్కుకున్న వారికి సాయపడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయని ప్రభుత్వం పేర్కొంది. శాంతాక్రజ్ లో ఓ ఇల్లు కూలిపోగా ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు నీటిలో కొట్టుకుపోయారు.

Related posts