వైసీపీ అధికారంలోకి వస్తే.. కేసీఆర్ చెప్పిన చోట జగన్ సంతకం పెడతారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. తన మాట వినకుంటే జగన్ అవినీతి ఫైల్‌పై కేసీఆర్ సంతకం పెడతారని జోస్యం చెప్పారు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా చంద్రబాబు బుధవారం అమరావతిలో పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బులు ఇస్తున్న వారికే వైసీపీ టిక్కెట్లు ఇస్తోందని ఆరోపించారు.
జనరల్ సెగ్మెంట్‌కు ఓ రేటు.. రిజర్వేషన్ సెగ్మెంట్‌కు ఓ రేటు పెట్టారని ఆ పార్టీ వీడిన వారే చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. మోడీ, కేసీఆర్‌లకు ఊడిగం చేయడానికి జగన్ సిద్దంగా ఉన్నారని బాబు దుయ్యబట్టారు. తెలంగాణ నుంచి అక్రమ మార్గంలో వచ్చే ధన ప్రవాహాన్ని పార్టీ శ్రేణులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జగన్ ఇంకా ఎన్నో విచిత్ర వేషాలు చూపిస్తారని వాటిని భరిస్తూ తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
నాకు సంక్షోభాలు కొత్తకాదు..నేను పోరాటం కొనసాగిస్తా: చంద్రబాబు