telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అయోధ్య చేరుకున్న మోదీ.. హనుమాన్ గఢీలో పూజలు

Modi ayodya

అయోధ్యలో రామాలయానికి భూమి పూజ చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మందిర ప్రాంతానికి చేరుకున్నారు. ఆయనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అనంతరం హనుమాన్ గఢీ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మోదీ పారిజాత మొక్కను నాటారు.

కాసేపట్లో స్వామీజీలతో కలిసి మోదీ భూమిపూజలో పాల్గొననున్నారు. ఆ ప్రాంతానికి ఇప్పటికే రామ్‌దేవ్ బాబా, స్వామి అవ‌దేశానంద గిరి, స్వామి చిదానంద స‌ర‌స్వ‌తితో పాటు పలువురు స్వామీజీలు వచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 నుంచి 12.45 మధ్య భూమిపూజ జరగనుంది. ప్రధాని మోదీతో కలిసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రామమందిర ట్రస్టు చీఫ్ నృత్య గోపాల్ దాస్, యూపీ రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ లు వేదికను పంచుకోనున్నారు.

Related posts