telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆ పేరుతో భారత్-పాక్ మధ్య సిరీస్ పెడితే బాగుంటుంది‌…

under 19 world cup india vs pak semis

భారత్, పాకిస్థాన్​ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల​ను తిరిగి పునరుద్ధరించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ ఛైర్మన్ జాకా అష్రాఫ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని కోరాడు. జిన్నా-గాంధీ పేరిట భారత్-పాక్ సిరీస్‌ను నిర్వహిస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమవుతాయన్నాడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ జాకా అష్రాఫ్. అయితే భారత్-పాక్ మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాల కారణంగా భారత్-పాక్ మధ్య 2008 నుండి ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్ లు జరగం లేదు. ఇక ఈ రెండు దేశాలు చివరిసారిగా 2019 ప్రపంచకప్​లో తలపడ్డాయి. ఇక భారత్-పాక్ సిరీస్ పై అష్రాఫ్ మాట్లాడుతూ… ‘నా పదవీకాలంలో జిన్నా-గాంధీ పేరుతో సిరీస్​ను ప్రారంభించడానికి ప్రయత్నించాను. ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా తెలిపాను. ఉగ్రవాద అంశాల కారణంగా భారత్ ఈ విషయంలో వెనక్కి తగ్గింది. జిన్నా-గాంధీ పేరుతో సిరీస్​ ప్రారంభిస్తే.. ఇరు దేశాల మధ్య క్రికెట్​ సంబంధాలు బలోపేతమవుతాయి. ఇది మరో యాషెస్​ సిరీస్​లా మారుతుంది” అని అష్రాఫ్​ పేర్కొన్నారు.

Related posts