telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం

pawan

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని సిద్దిపేట కు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి అయిన రఘునందన్ ఇంట్లో అలాగే అతను బంధువుల ఇంట్లో పోలీసులు తనిఖీలు చెప్పట్టారు. ఇందులో రూ.18.67 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో బీజేపీ కార్యకర్తలు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. స్వాధీనం చేసుకున్న నగదును లాకెళ్ళుతూ పరుగులు తీశారు కార్యకర్తలు. అనంతరం ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఈ విషయం తెలుసుకుని బీజేపీ నేతలు అలాగే బండి సంజయ్ సిద్దిపేట కు బయల్దేరారు. కానీ సిద్దిపేట లో సంజయ్ ని అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే బండి సంజయ్ అరెస్ట్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ స్పందించారు. “భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారిని పోలీసులు అరెస్ట్ చేయడం దుందుడుకు చర్య. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో బండి సంజయ్ గారిపైనా, బీజేపీ నాయకులపైనా పోలీసుల చర్యలు పలు సందేహాలకు తావిస్తోంది. ఉద్రిక్తతలకు తావిచ్చే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నియమావళిని, నిబంధనలను అన్ని పార్టీలకు ఒకేలా వర్తింపచేయాలి. పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థినీ, శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వెళ్ళడం గర్హనీయం. బండి సంజయ్ గారి అరెస్ట్ అప్రజాస్వామికం. ఈ అరెస్టును ఖండిస్తున్నాం.” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Related posts