ముగ్గులతోనే సంక్రాంతి పండుగకు కళ వస్తుందని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సికింద్రాబాద్ మారేడుపల్లి జిహెచ్‌ఎంసీ క్రీడా మైదానంలో సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల్లోని సృజనాత్మకత వెలుగులోకి వచ్చేందుకు పోటీలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు.
మహిళలు వేసిన రంగు రంగుల ముగ్గులతో సంక్రాంతి శోభ ముందుగానే వచ్చిందన్నారు. ఇలాంటి పోటీల నిర్వహణ వల్ల మహిళల్లో ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మర్రి రాజశేఖర్‌రెడ్డి, కార్పొరేటర్ ఆకుల రూప, స్థానిక మహిళలు పాల్గొన్నారు.
శ్రీమంత్ పాటిల్ లేఖపై అనుమానాలు వ్యక్తం చేసిన కర్ణాటక స్పీకర్