telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మరో కొత్త ఫీచర్ తో వచ్చిన వాట్సప్‌…

whatsapp

వాట్సాప్ ఫేస్‌బుక్ కొనుక్కున్న తర్వాత రోజు రోజుకూ సరికొత్త అప్‌డేట్స్‌ తో యూజర్లఇన్ థ్రిల్ చేస్తోంది. ప్రస్తుతం మనం వాట్సప్ లో అందుబాటులో ఉన్న ఫీచర్ ప్రకారం పొరపాటున అవతలి వ్యక్తికి పంపిన వీడియోలను, మెసేజెస్, ఇమేజెస్, ఫైల్స్, ఎమోజీలను కొంత సమయంలోపు అవతలి వ్యక్తికి కూడా కనిపించకుండా డిలీట్ చేసే అవకాశం ఉంది. నిర్ణీత సమయం తర్వాత ‘డిలీట్ ఫర్ ఆల్’ ఆప్షన్ పనిచేయదు. దీన్ని అధిగమించడానికి మరో కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు వాట్సాప్ కసరత్తులు చేస్తుంది. ఈ ఫీచర్ను ఎనేబుల్ చేసుకుంటే ఇక నుంచి మీకు వచ్చిన పర్సనల్ మెసేజెస్, గ్రూప్స్ మెసేజెస్ ఏడు రోజుల వరకే కన్పిస్తాయి. ఆ తర్వాత ఆయా మెసేజెస్ వాటంతట అవే డిలీట్ అయిపోతాయి. దీనికి సంబంధించిన నూతన మెసేజ్ ఫీచర్ను అధికారికంగా ధృవీకరించింది వాట్సాప్. ఈ నూతన మెసేజింగ్ ఫీచర్ను వెబ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, కైయోస్ వాట్సాప్ యూజర్లకు అందుబాటులో ఉంచనుంది. అయితే, ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులో రానున్న విషయాన్ని మాత్రం వాట్సాప్ స్పష్టత నివ్వలేదు. అయితే, ఈ కొత్త ఫీచర్తో మీకు వచ్చిన మెసేజెస్ను ఇతరులకు ఫార్వార్డ్ కనుక చేస్తే అటువంటి మెసేజెస్ మాత్రం అదృశ్యం కావని సంస్థ తెలిపింది.

Related posts